డాక్టర్ సుధాకర్‌కు ఎమ్మెల్యే ఘన నివాళులు…

పెడన, ఆంధ్రప్రభ : దళితులపై జరిగిన అమానుష ఘటనలను గుర్తుచేస్తూ పెడన మండలం పుల్లపాడు పంచాయితీ దేవరపల్లి గ్రామంలో దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అక్రమ కేసులు, అవమానాలపై జరిగిన అమానుష ఘటనలను గుర్తుచేస్తూ “దళితులకు నరకయాతన”గా మారిన గత వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు

“మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు” అంటూ అధికారంలోకి వచ్చిన జగన్, అదే వర్గాల ప్రజలపై అణచివేతకు పాల్పడ్డారని విమర్శించాను. జగన్ పాలనలో 200 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని తెలిపాను.

డాక్టర్ సుధాకర్ ఘటన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఘటన, డాక్టర్ అచ్చెన్న ఘటన వంటి సంఘటనలు జగన్ ప్రభుత్వంలో దళితుల పరిస్థితికి నిదర్శనం. డాక్టర్ సుధాకర్‌ను రోడ్డుపై అవమానకరంగా లాక్కెళ్లడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో కోల్పోవడం వంటి ఘటనలు దళిత సమాజాన్ని తీవ్రంగా కలచివేసాయన్నారు.