వరి ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి..
వరి ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి..
రెండు రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల, ఆంధ్రప్రభ : వేసవిలో రైతులు పండించిన వరి ధాన్యం, కొనుగోలు, దిగుమతులు వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు . బుధవారం మండలంలోని శాంతినగర్ శివారు వెంకటేశ్వర రైస్ మిల్, కైలాపూర్ శివారు మహా శ్రీ వీర ఇండస్ట్రీస్, రైస్ మిల్లులను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తనిఖీ చేశారు. అనంతరం మిల్లర్లు ను కొనుగోలు చేసిన వరి ధాన్యం, ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి, రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, తాసిల్దార్ వసంతరావు, ఆర్ఐ రాజేందర్ ,చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ నాయకులు గూట్ల తిరుపతి , ముకిరాల మధువంశీకృష్ణ, దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమరయ్య, చిలుకల రాయ కొమురు, బుర్ర శ్రీనివాస్, గంగాధరి రవీందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
