ప్రమాదవశాత్తు లారీలో మంటలు
ప్రమాదవశాత్తు లారీలో మంటలు
- తృటిలో తప్పించుకున్న డ్రైవర్, క్లీనర్
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రైస్ మిల్లుల సమీపాన మట్టి లోడ్ కరీంనగర్ వైపు వెళ్తున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. తీవ్రమైన ఎండల కారణంగా సుల్తానాబాద్ పైపు నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీలో ఆకస్మాత్తుగా ఇంజన్ నుండి అధిక వేడికి మంటలు చెలరేగడంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ అప్రమత్త మై లారీలో నుండి తక్షణమే దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.
లారీలో మంటలు చెలరేగి క్యాబిన్ పూర్తిగా దగ్ధమైపోయింది. దీంతో చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లులోని వివిధ కార్మికులు మంటలు ఆర్పి వేసేందుకు చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత వల్ల అగ్నిఖిలలు ఎగిసిపడడంతో తీవ్ర వేడి ప్రభావం రాగా ఆపే ప్రయత్నం చేసినవారు సైతం వేడిని తట్టుకోలేకపోయారు. ప్రాణా నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ మంటలను ఆర్పి వేయించి రోడ్డు పై ఉన్న లారీని పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.
