Software Employee | అమెరికాలో ఏపీ యువకుడి మృతి

Software Employee | అమెరికాలో ఏపీ యువకుడి మృతి

Software Employee | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. బాపట్ల జిల్లాకు చెందిన ఆవుల పూర్ణగోపీ (35) కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పూర్ణగోపీ తన కుటుంబంతో కారులో వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి పూర్ణగోపీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన తండ్రి ఆవుల శ్రీనివాసరావు, తల్లి, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన కుటుంబ సభ్యులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్ణగోపీ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాపట్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.