social media | సిద్దిపేటలో వైరల్‌గా మారిన ఘటన
social media | సిద్దిపేటలో వైరల్‌గా మారిన ఘటన
social media | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీల్ చేసిన బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బీరు ప్రియులు భయాందోళనకు గురవుతుండగా.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అక్బర్‌పేట భూంపల్లిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాపులో ఓ వ్యక్తి కింగ్‌ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సీల్ తీయని మరో బాటిల్‌ను పరిశీలించగా.. అందులో కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే బాటిల్‌ను తీసుకుని వైన్ షాపు వద్దకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు.

వైన్ షాపు సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించడంతో బాధితుడు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీల్డ్ బాటిల్‌లోకి కండోమ్ ప్యాకెట్ ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది తయారీ లోపమా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందని పలువురు మండిపడుతున్నారు.
