AP | పరువు నష్టం కేసు.. జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా !
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి… వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు. వరుసగా విచారణకు సమయం కోరుతున్నారని పిటిషన్ ని రెగ్యులర్ విచారణ జరపాలని జగన్ తరపు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో హైకోర్టు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
అమరావతి రాజధాని నిర్మాణ క్రమంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ ఓ పత్రికలో రాసిన కథనాలు.. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ… విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ పిటిషన్ వేశారు.
దీనిపై గతంలోనూ దీనిపై విచారించిన కోర్టు.. జగన్ హాజరుకావాలని పలుమార్లు సమన్లు కూడా పంపింది. అయినా ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ తనపై వేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.