Supreme Court | సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి
Supreme Court | సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి
Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : జనగణనలో కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులగణనను ఏజెన్సీలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ దాఖలైన ఈ ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ పిల్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. జనగణన కుల ప్రాతిపదికన నిర్వహించాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపర నిర్ణయమని వ్యాఖ్యానించింది. ఇలాంటి అంశాల్లో కోర్టు జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది.
వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు బీసీల సంఖ్యపై స్పష్టత అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది.
