20th May 2026 | తిరుమల సమాచారం..

20th May 2026 | తిరుమల సమాచారం..

20th May 2026 | తిరుమల, ఆంధ్రప్రభ :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (19-05-2026) తిరుమల శ్రీవారిని మొత్తం 84,315 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఇక శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 43,032గా నమోదైంది. హుండీ కానుకల ద్వారా టీటీడీకి రూ.3.74 కోట్ల ఆదాయం లభించింది.

ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్సులు పూర్తిగా నిండిపోయి, భక్తుల క్యూలైన్ శిలాతోరణం వెలుపల వరకు కొనసాగుతోంది.

ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.