అవయవ దానంతో పునర్జన్మనిచ్చిన రాఘవ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన పులిపలుపుల రాఘవ (19) రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అవయవ దానం చేయడం ద్వారా రాఘవ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చినవాడయ్యాడని పలువురు కన్నీటి నివాళి సమర్పించారు.

హైదరాబాద్ ఆసుపత్రి లో రాఘవకు అక్కడి వైద్యులు, సిబ్బంది నివాళులర్పించారు. ఆస్పత్రి నుండి అంబులెన్స్ లో మంగళవారం మధ్యాహ్నం వచ్చిన రాఘవ మృతదేహాన్ని స్థానిక సాయిబాబా ఆలయం నుండి బస్టాండ్ మీదుగా అతని స్వగృహానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వందలాది మంది యువకులు, స్థానికులు, ప్రజలు రాఘవకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Leave a Reply