ప్రజల్లో మమేకమై పోలీసుశాఖ ప్రతిష్ట పెంచాలి

ప్రజల్లో మమేకమై పోలీసుశాఖ ప్రతిష్ట పెంచాలి

ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు వచ్చిన కానిస్టేబుళ్లకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచన

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజలకు మరింత చేరువై క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను పెంపొందించేలా పనిచేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏపీఎస్పీ నుంచి ఏఆర్ విభాగానికి కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన ఎస్పీ పలు సూచనలు చేశారు.

వివిధ వీఐపీ పర్యటనలు, ఉత్సవాలు, బందోబస్తు విధుల్లో ఏఆర్ విభాగం పోలీసులకు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, వినయ విధేయత, ప్రజల పట్ల సానుకూల వైఖరి అత్యంత కీలకమని అన్నారు.

ఏపీఎస్పీ 2003 బ్యాచ్‌కు చెందిన ఈ కానిస్టేబుళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొత్తం 12 మందిని కేటాయించగా, అందులో కర్నూలు జిల్లాకు 9 మందిని నియమించినట్లు తెలిపారు. ఈ తొమ్మిది మంది కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ నుంచి కర్నూలు ఏఆర్ విభాగానికి బదిలీపై వచ్చారు. మిగిలిన ముగ్గురిని నంద్యాల జిల్లాకు కేటాయించినట్లు సమాచారం.

ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు తమకు సహకరించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply