ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

భవనం మధుసూదన్ రెడ్డి

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ​ఆదివారం చౌటుప్పల్ మండల బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్ అధ్యక్షతన మండల పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని సభకు మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. సభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బర్మ నాగరాణి, భాతరాజు వెంకటేష్, బండ శేఖర్, గుండెపురం నరేష్, ఉప్పు ఆంజనేయులు, కొయ్యాడ స్వామి, కరెంటోత్ రాజు నాయక్, కొండూరు వికాస్, వినయ్ రెడ్డి, పోలోజు భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply