Rs.1.5Crore | దొంగిలించిన నగలతో ప్రియుడు పరార్

Rs.1.5Crore | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అహ్మదాబాద్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. విడాకులు తీసుకున్న ఓ సేల్స్ గర్ల్ తన ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని భావించి రూ.1.5 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించింది. అయితే చివరికి ప్రియుడే ఆమెను మోసం చేసి పరారయ్యాడు.

నికోల్ ప్రాంతానికి చెందిన హర్షిదా శెట్టి అనే యువతి పనిచేస్తున్న చోట భారీ విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. తన పెళ్లైన ప్రియుడితో స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

దొంగిలించిన నగలను ప్రియుడికి చూపించగా.. అతడు కేవలం రూ.18 లక్షల విలువైన నగలు మాత్రమే వదిలి, మిగిలిన సొత్తుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హర్షిదాను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు.