మీ ఓట్లు నేను అడగను..! జీసస్ మీద ప్రమాణం..!

మీ ఓట్లు నేను అడగను..! జీసస్ మీద ప్రమాణం..!
- డిప్యూటీ స్పీకర్
నాపై పగబట్టండి..నా పార్టీ ఏం చేసింది.
రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడితే తప్ప..?
అన్ని పార్టీలకు 20 శాతం ఓట్లు కావాలి.
హిందువులకు ఓట్లు ఉన్నాయా అన్న సందేహం.!
కాళ్ళ, ఆంధ్రప్రభ : కేవియట్ పిటీషన్ ముందుగా వెయ్యకపోవడం పొరపాటేనని రామ భక్తులకు క్షమించాలని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కాళ్ళ మండలం పెదఅమిరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆకివీడు రామాలయం అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం నుంచి మళ్లీ జడ గోల మొదలైందని వ్యంగంగా ప్రారంభించారు. అతనికి విలువలు ఉంటాయనుకోవడం పొరపాటేనని విమర్శించారు. గతంలో హైకోర్టులో జరిగిన విచారణ గురించి ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో కూడా జడ శ్రవణ్ కుమార్ ఉండ్లమట్ల జయంతి అనే మహిళ ద్వారా పిటిషన్ వేశారని తెలిపారు.
కేవియట్ వెయ్యకపోవడం(“ముందుగా తమ వాదన కూడా వినాలని ఎదుటి వ్యక్తి పిటీషన్ వేస్తారన్న అనుమానం వచ్చినప్పుడు వేసే పిటీషన్ ఇది..) పొరపాటు జరిగిందని రామభక్తులు క్షమించాలని కోరారు. అయితే 28వ తేదీ కోర్టు సెలవులు వచ్చేలోపే అనుభవజ్ఞులైన లాయర్లతో సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. రామాలయం నిర్మాణం బేస్మెంట్ ఇప్పటికే పూర్తయిందని, కృష్ణశిల నిర్మాణం పనులు మిగిలిందని,పనులు కొంత సమయం విరామం వచ్చిన నష్టం లేదని తెలిపారు. సుప్రీంకోర్టు కేవలం స్టేటస్కో మాత్రమే ఇచ్చారని, “స్టే” కాదన్నారు. కొంతమంది క్రైస్తవులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారని, ప్రభో.. అని ఏడ్చే రోజు వస్తుందని ఎద్దేవా చేశారు. వారు ప్రారంభించారు కాబట్టి ఎటువంటి ప్రభుత్వ భూముల్లో చర్చీలు ఉన్న చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హిందువుల ఓట్లపై సందేహం..?
కొంతమంది హిందూ దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం మాట్లాడితే తప్పు అంటున్నారని, తనను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇబ్బంది లేదని, తనకు సెక్యూరిటీ ఉందన్నారు. దళిత క్రైస్తవులకు ఓట్లు ఉన్నాయి.. చంద్రబాబు, లోకేష్ చర్యలు తీసుకోవాలని కొంతమంది గద్గోళపెడుతున్నారన్నారు. ఇదంతా చూస్తే హిందువులకు ఓట్లు ఉన్నాయా లేవా అని సందేహం వచ్చి చూశానన్నారు. హిందువులకు కూడా ఓట్లు ఉన్నాయని తెలిపారు. 80 శాతం ఓట్లు మీకు అక్కర్లేదా చంద్రబాబు, లోకేష్ అని తాను అడగట్లేదన్నారు. మీ హక్కుల గురించి మాట్లాడండి కానీ, తనపై పడి ఏడవకండి అంటూ హితవు పలికారు. ఒక హిందువుగా ఉండి, దళిత హిందువుల గురించి మాట్లాడానని, రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడితే తప్పాని ప్రశ్నించారు. పార్టీలకి కేవలం 20 శాతం వారి ఓట్లు మాత్రమే కావాలని, వారిని ఆ 20 శాతం ఓట్లు పంచుకోవాలని చురకలేశారు.
తాను దళిత క్రైస్తవుల ఓట్లు అడగబోను..
తన మీద పగబట్టండి గాని, తాను ఉన్న పార్టీ ఏమి చేసిందని, తనపై ద్వేషం ఉంటే ఓటేయడం మానేయండన్నారు.తమ పార్టీ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మీ అభివృద్ధి కాంక్షించే పార్టీని ఏమనద్దన్నారు. తనను ద్వేషిస్తున్నారు కాబట్టి, రాజ్యాంగం లో ఉన్నది ప్రశ్నిస్తున్నాను కాబట్టి, రాజ్యాంగం మారేవరకు మీ ఆకాంక్ష తీరే వరకు మిమ్మల్ని ఓటు అడగనన్నారు. జీసస్ మీద ప్రమాణం చేసి చెబుతున్నానని వెల్లడించారు. తొందర్లోనే ఎలా శ్రవణ్ కుమార్ పిటిషన్ కూడా కొట్టివేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
