ఎదురెదురుగా ఢీకొన్న బైకులు.. ఒకరు మృతి
ఉయ్యూరు, ఆంధ్రప్రభ ; గన్నవరం- కంకిపాడు రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కేసరపల్లి గ్రామానికి చెందిన వేముల శేషగిరి(33)గా గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
