Ntr District Collector : వావ్​ .. లక్ష్మీశ మాధూర్యం Andhra Prabha News

Ntr District Collector : వావ్​ .. లక్ష్మీశ మాధూర్యం Andhra Prabha News

  • ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్ సహజ గానామృతం
  • ఐజీఎంసీ స్టేడియంలో పాటల సందడి
  • ఎవర్‌గ్రీన్ సాంగ్​ తో అలరించిన లక్ష్మీశ..

( ఆంధ్రప్రభ విజయవాడ)

Ntr District Collector : ఎన్టీఆర్ జిల్లా జి లక్ష్మీ శ తన ప్రత్యేక ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో కలెక్టర్ డా. లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని గీత మాధురి తో కలిసి కలెక్టర్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’ అనే ఎవర్‌గ్రీన్ గీతాన్ని ఆలపించారు.

కలెక్టర్ స్వయంగా గొంతెత్తి పాట పాడటంతో ప్రేక్షకులు విజిల్స్, చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తూ ప్రోత్సహించారు. కలెక్టర్ లక్ష్మీ శ సంగీతాభిరుచి, వేదికపై ఆయన చూపిన ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Leave a Reply