ప్రభుత్వ పాఠశాలలే మేలు…

ప్రభుత్వ పాఠశాలలే మేలు…

ఎంఈఓ మల్లికార్జున

రాప్తాడు, ఆంధ్రప్రభ : మీ పిల్లలకు భద్రత మరియు మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేది ప్రభుత్వ పాఠశాలలు ఒక్కటేనని రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం రాప్తాడు మండల పరిధిలోని బండమీదపల్లి గ్రామం నందు ఎన్రోల్మెంట్ డ్రైవింగ్ ను నిర్వహించారు.ఈ సంధర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని నాణ్యమైన విద్య గురించి అలాగే ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాల గురించి తెలియజేస్తూ అవగాహన కల్పించారు. గ్రామంలో 12 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు.చాలా సంతోషించాల్సిన విషయం అన్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు నిండుకుండలా కళకళలాడుతాయని తెలియజేశారు. వేలు లక్షల్లో ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో చదివించిన నాణ్యమైన విద్య అందుదు అని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను మానసికంగా శారీరకంగా వేధించడంతోపాటు అనేక ఇబ్బందులు పెడతారనేది మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర ప్రసాద్ ఉపాధ్యాయులు వెంకటనాయుడు సిఆర్ఎం టిఎస్ రామాంజనేయులు నాగభూషణం ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.