అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న మాజీ ఎమ్మెల్యే

అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న మాజీ ఎమ్మెల్యే

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు వీధిలైట్లు మంచినీళ్ల కుళాయిలు అవసరమైన గ్రామాలకు తారు రోడ్లు వేయిస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను చూసి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని టిడిపి మండల కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు కన్వీనర్ పంపు కొండప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అరాకొరా అభివృద్ధితో ప్రజలు రైతులు విలవిలాడినారు.

తోపుదుర్తి బ్రదర్స్ ప్రతి గ్రామంలోనూ రెండు వర్గాలు ఏర్పాటు చేసి ధనార్జనేధేయంగా పరిపాలన సాగించారు. వైసిపి హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సులు ఇవ్వలేదు. తోపుదుర్తి గ్రామానికి కనీసం తారు రోడ్డు కూడా వేయించుకోలే పోయారు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తన ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారని ఎద్దేవా చేశారు.ఇక పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది.ఈ ధరలను తగ్గించేందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితంగా ప్రయత్నం చేస్తారని తెలిపారు.ప్రజల పైన ఎలాంటి భారం మోపకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేందుకు కృషి చేస్తారని తెలియజేశారు.

గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తోంది. మీరు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక టిడిపి పార్టీ మీద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీద అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఏమాత్రం అభివృద్ధి చేసినారో ఒక్కసారి గుర్తుతెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. మా ఎమ్మెల్యే పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరూరు పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ గోపాల్ నాయుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి బండమీదపల్లి వెంకటరాముడు హి.పా అధికార ప్రతినిధి పాలచెర్ల ముత్యాలప్ప మాజీ కన్వీనర్ నారాయణస్వామి కురుబ సాధికార రాష్ట్ర నాయకుడు గంగలకుంట రమణ రాప్తాడు శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply