Rs 3.36 Cr. Kanaka Durgamma : కానుకల వర్షం Andhra Prtabha Spl News
Rs 3.36 Cr. Kanaka Durgamma : కానుకల వర్షం Andhra Prtabha Spl News
- 16 రోజుల్లో రూ.3.36 కోట్ల ఆదాయం
- 232 గ్రాము బంగారం
- 4.2 కిలో వెండి సమర్పించిన భక్తులు..
- విదేశీ కరెన్సీతోనూ విశేష కానుకలు..
- డాలర్లు, రియాల్స్, యూరోలు హుండీలో లభ్యం
- రూ.2000 పాత నోటు కూడా హుండీలో దర్శనం
- ఆలయ ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో లెక్కింపు
- సీఆర్పీఎఫ్ భద్రత మధ్య హుండీ లెక్కింపు ప్రక్రియ
( ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి)

Rs 3.36 Cr. Kanaka Durgamma : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం లో ని కనకదుర్గమ్మ కు భక్తులు పెద్ద ఎత్తున కానుకులను సమర్పించుకున్నారు. గడచిన 16 రోజుల హుండీలను సోమవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులో ఈ ప్రక్రియ సాగింది. గత మే 2న హుండీ మూసివేసిన తర్వాత నుంచి మే 18 వరకు మొత్తం 16 రోజుల కాలానికి హుండీ లెక్కింపులో రూ.3,35,87,555 నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో రూ.3,20,79,555, నాణేల రూపంలో రూ.15,08,000 లభించాయి. రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.20,99,222గా నమోదైంది. అమ్మవారికి భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి రూపంలో కూడా కానుకలు సమర్పించారు. హుండీ లెక్కింపులో 232 గ్రాముల బంగారం, 4 కిలోల 200 గ్రాముల వెండి లభించాయి.
Rs 3.36 Cr. Kanaka Durgamma : విదేశీ భక్తులు సైతం

విదేశీ భక్తుల నుంచి కూడా విశేషంగా విదేశీ కరెన్సీ సమర్పణలు అందాయి. అమెరికా డాలర్లు, ఖతార్ రియాల్స్, మలేషియా రింగిట్స్, యూఏఈ దిర్హామ్స్, సింగపూర్ డాలర్లు, కెనడా డాలర్లు, యూరోలు, ఇంగ్లండ్ పౌండ్లు, చైనా యువాన్ తదితర విదేశీ కరెన్సీలు హుండీలో లభించాయి. అలాగే పాత కరెన్సీ నోట్లలో రూ.2000 నోటు ఒకటి కూడా లభించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపును ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండగా ఆలయ అధికారులు సిబ్బంది సీఆర్పీఎఫ్ ఇతర అధికారుల సమక్షంలో హుండీలను లెక్కించారు.
ALSO READ : Kanaka Durga Train : కనక దుర్గ రైలుకు గ్రీన్ సిగ్నల్ Andhra Prabha News
