మొబైల్ మెడికల్ క్యాంప్‌కు రెండవ రోజు విశేష స్పందన..

మొబైల్ మెడికల్ క్యాంప్‌కు రెండవ రోజు విశేష స్పందన..
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట మసీదు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు.. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 54, 55 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్సతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో, తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
ఆంధ్ర హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు. శంకర్ నేత్ర చికిత్సాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. దుహిత డెంటల్ హాస్పటల్ వారి సహకారంతో దంత పరీక్షలు, వైద్య సహాయం అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 54వ డివిజన్ టిడిపి నాయకులు అబ్దుల్ హర్షద్, 54వ డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ తారీక్ అజీజ్,జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ తాజుద్దీన్, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకట రమణ, హరీష్, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
