వై. ఎన్. కళాశాల ఆధ్వర్యంలో వస్త్ర సంచుల పంపిణీ..

వై. ఎన్. కళాశాల ఆధ్వర్యంలో వస్త్ర సంచుల పంపిణీ..

సామాజిక సేవా కార్యక్రమం లో భాగంగా..

నర్సాపురం, ఆంధ్ర ప్రభ : అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని వై ఎన్ కళాశాల ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ చేశారు.
సామాజిక సేవా కార్యక్రమం లో భాగంగా శ్రీ.వై.ఎన్. కళాశాల సామాజిక సేవా కేంద్రం ద్వారా శుక్రవారం ప్రజలకు వస్త్ర సంచులను ఉచితంగా అందచేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనకారావు మాట్లాడుతూ ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే పర్యావరణ ప్రమాదాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, పర్యావరణానికి హానిచేయని ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్లాస్టిక్ సంచులు భూమిలో కలవడానికి వందల సంవత్సరాలు పడుతుందని మరియు ఇవి వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయని వివరించారు .

ప్రజలలో అవగాహనను పెంచి ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలని చెబుతూ, స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించేందుకు కళాశాల యాజమాన్యం కృషి చేస్తోందని చెప్పారు. సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను అవలంబించేలా వ్యక్తులు , వ్యాపారులు కూడా ప్రోత్సహించడం వంటి అత్యవసర ఆవశ్యకతను గూర్చి ప్రజలకు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బెజవాడ వెంకటరత్నం, ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ గంధం శ్రీరామకృష్ణ, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. బి. ఆనందకుమార్, హిందీ విభాగాధిపతి గణేష్, ఎన్. ఎస్. ఎస్. ఆఫీసర్ చింతా సోమేశ్వరి, కెమిస్ట్రీ ఉదయభాస్కర్, ప్రసాద్, బయోటెక్ శ్యామ్, మెథ్స్ బాలరాజు, కుసుమ, జూనియర్ కళాశాల తెలుగు విభాగం పద్మజ, సామాజిక సేవా కేంద్రం సమన్వయకర్త బి.ప్రసాద్ ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.