ముమ్మరంగా పోలీసులు వాహనాల తనిఖీలు
ముమ్మరంగా పోలీసులు వాహనాల తనిఖీలు
చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని శివాజీ సెంటర్ వద్ద పోలీసులు ఆదివారం సాయంత్రం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. చిట్యాల ఎస్సై ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు , ఫోర్ వీలర్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సర్టిఫికెట్ , సరైన పత్రాలను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను, కార్ల డిక్కీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో పోలీస్ కానిస్టేబుళ్లు, లాల్ సింగ్, క్రాంతి, సందీప్ , తదితరులు పాల్గొన్నారు.
