కల్వల మోడల్ కాలేజ్ కు దరఖాస్తులు ఆహ్వానం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కల్వల ఆదర్శ జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈనెల 25 లోక దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పరిమి నవీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరకాస్తుల ప్రక్రియ ఈనెల 13 నుంచి కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 27న ప్రకటించి,28 నుంచి 30 వరకు ధృవపత్రాల పరిశీలనతో పాటు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసిసి, ఇసి, ఏసి ఈ, కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఏసిఈ గ్రూపులో అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు బోధించబడతాయని పేర్కొన్నారు. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. బాలికల కోసం 100 మంది విద్యార్థినులకు ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించబడి నందున జిల్లాలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని ప్రిన్సిపల్ ఈసందర్భంగా కోరారు.
