AP CM SAVINGS : పొదుపరి గా.. చంద్రన్న Andhra Prabha Top News
AP CM SAVINGS : పొదుపరి గా.. చంద్రన్న Andhra Prabha Top News
- 4 కార్ల కాన్వాయ్ సరి
- హెల్మెట్ బ్యాంకు బాబు బాగు
- సవర కోటు సూపర్
( ఆంధ్రప్రభ, శ్రీకాకుళం బ్యూరో)

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పొదుపు చర్యల్లో భాగంగా సీఎం నాలుగు వాహనాల కాన్వాయ్ లో మాత్రమే ప్రయాణించారు. శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధి నివేదికను సీఎం చంద్రబాబు ప్రజలకు చదివి వినిపించారు.

వివిధ శాఖల పనితీరును ప్రజలకు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని రాజులచెరువు ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తామని, ఎన్ హెచ్ 5 నుంచి నరసన్నపేట పట్టణ పరిధిలో రూ. 15 కోట్లు వ్యయంతో రహదారి నిర్మాణం చేపడతామని, కింజరాపు ఎర్రన్నాయుడు చిల్ట్రన్ పార్క్ ఏర్పాటు చేస్తామని , శ్రీముఖ లింగం ఆలయ ఉత్సవాలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం తిలకించారు.
AP CM SAVINGS : సవర ఓవర్ కోటులో…

అక్కడ సీతంపేట ఐటీడిఏ ఆధ్వర్యంలో గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన సవర ఆర్ట్ ఓవర్ కోటు ను ముఖ్యమంత్రి ధరించారు.

పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్ ను చూసి సీఎం అభినందించారు. హెల్మెట్ ధరించి అక్కడే ఉన్న బుల్లెట్ వాహనం అధిరోహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
AP CM SAVINGS : ప్రధాని స్ఫూర్తితో..
“యుద్ద ప్రభావం కారణంగా ప్రధాని మోదీ చేసిన సూచనలను బాధ్యత గల పౌరులుగా అందరం పాటించి దేశానికి సహకరిద్దాం. వర్క్ ఫ్రం హోం అలవాటు చేసుకుని వీలైనంతవరకూ ఇంట్లో నుంచే పనిచేద్దాం. బంగారం కొనడం తగ్గిద్దాం. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లోనే ప్రయాణిద్దాం.

వంట నూనెల వాడకం తగ్గిద్దాం. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దాం. మేడిన్ ఆంధ్రా, మేడిన్ ఇండియా బ్రాండ్లను కొనుగోలు చేద్దాం. టూరిజం కోసం విదేశీ పర్యటనల కంటే ఏపీ లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలి”అని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
ALSO READ : Cm Cbn Operation Clean : గత పాలనలో టెర్రరిజం Andhra Prabha Top News
