ప్రమాదంగా మారిన బావి పూడ్చివేత పనులకు శ్రీకారం
ప్రమాదంగా మారిన బావి పూడ్చివేత పనులకు శ్రీకారం
- పనులను ప్రారంభించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం గుంటూర్ పల్లి.. కేశవపూర్ రహదారిలో ప్రమాద భరితంగా నెలకొన్న బావి పూడ్చివేత పనులకు స్వచ్ఛందంగా గంటూర్ పల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చల్లా రాకేష్ రెడ్డి స్వచ్ఛందంగా శ్రీకారం చుట్టారు. శనివారం రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రహదారిలో గంటూర్ పల్లి ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న బావి పూడ్చివేత పనులను కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బావి పూడ్చివేత పనులను ఏసీపీ సహకారంతో తాను స్వచ్చందంగా చేపట్టామని పేర్కొన్నారు. రహదారి పక్కనే బావి ఉండడంతో రెండు గ్రామాల ప్రజలు, ప్రయాణీకులు భయాందోళనలకు గురి అయ్యే వారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న బావి పూడ్చివేత పనులను చేపట్టడం సంతోషంకరంగా ఉందని తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో తాను ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హమీల్లో భాగంగా బావి పూడ్చివేతతో పాటు మహిళలు బతుకమ్మ ఆడడానికి స్థలం చదును పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హసన్ పర్తి సీఐ ఎ మహేందర్, కేశవపూర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు పోరెడ్డి చాణిక్య రెడ్డి, స్థానిక ఉపసర్పంచ్, పంచాయతీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
