entry3faces | ఫణిగిరి బౌద్ధ క్షేత్రం – విద్యార్థులకు చారిత్రక విజ్ఞాన యాత్ర

entry3faces | ఫణిగిరి బౌద్ధ క్షేత్రం – విద్యార్థులకు చారిత్రక విజ్ఞాన యాత్ర

entry3faces | ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విశిష్టత
మ్యూజియం, మహా స్తూపం ప్రత్యేక ఆకర్షణలు
కాకతీయుల కాలం నాటి సీతారామచంద్రస్వామి ఆలయం
ప్రకృతి అందాలతో అలరారుతున్న ఫణిగిరి
విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే చారిత్రక ప్రదేశం

entry3faces | తిరుమలగిరి, ఆంధ్రప్రభ : వేసవిలో విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉన్న చారిత్రక, అపురూప, అద్భుతమైన శిల్ప సంపద, పురాతన ఆలయాలను చూపించండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పనిగిరి గ్రామంలోని బౌద్ధ క్షేత్రాన్ని, శిల్ప సంపదను, అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంను, మహా స్తూపాన్ని, చైత్య గృహాలు, ఉద్దేశికలు, తవ్వకాలలో బయటపడిన బంగారు నాణాలు, మట్టి సున్నపు బొమ్మలు, పూసలు, భిక్షువులు తపస్సు చేసిన మందిరాలను చూపిస్తూ బౌద్ధ మత వ్యాప్తి, ఆ కాలంలో శాంతి విరాజిల్లిన సంఘటనలు పిల్లలకు వివరించాలి.

entry3faces

కాకతీయ కాలంలో నిర్మించిన ప్రాచీన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని చూపించవలసిన ఆవశ్యకత ఉంది. బౌద్ధ క్షేత్ర గుట్ట కింద రాతి స్తంభాలతో అందంగా, అపురూపంగా సీతారాముల ఆలయం ఉంది. ధ్వజస్తంభం, గర్భగుడిలోని విగ్రహాలు, రథాలు, మూడుముఖాల ద్వారాలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి.

entry3faces

ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలు, చెరువులు దర్శనమిస్తాయి. ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు మామిడి చెట్లు, ఆహ్లాదకర వాతావరణం ఈ ప్రాంతాన్ని రమణీయంగా, కమనీయంగా, ప్రకృతి అందాలతో అద్భుతంగా, ఆకర్షణీయంగా నిలబెడుతోంది. పక్షుల కిలకిల రాగాలు భక్తి భావాన్ని కలిగించేలా ఫణిగిరి ప్రాంతం ప్రత్యేకతను చాటుతున్నాయి. తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకుని ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, సీతారామచంద్రస్వామి ఆలయాన్ని చూపించడం ద్వారా పిల్లల్లో విజ్ఞానం, చరిత్రపై అవగాహన, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు.

entry3faces

entry3faces

CLICK HERE TO READ ఆత్మశోధనతో వ్యక్తిత్వ వికాసం

CLICK HERE TO READ MORE