ఒండుమట్టి టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

ఒండుమట్టి టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

  • టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణం

మక్తల్, ఆంధ్రప్రభ ; ఉండు బట్టి తరలించే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీస్తుంది.గత వారం రోజులుగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో చెరువుల్లో ఒండు మట్టి తరలింపు పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో ఒండు మట్టిని తరలించే రిప్పర్ డ్రైవర్లు అత్యంత నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. టిప్పర్ ఎదురొచ్చిందంటే పక్కకు తప్పుకునే పరిస్థితి తప్ప నేరుగా ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది అని స్థానికులు అంటున్నారు.

టిప్పర్ డ్రైవర్లు మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా ఎదురొచ్చే వాహనాలు వ్యక్తుల పైకి వెళ్లే విధంగా రాష్ డ్రైవ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఒండు మట్టిని తరలిస్తూ పట్టణ సమీపంలోని గొల్లపల్లి క్రాసింగ్ వద్ద టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న ఓ వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో టిప్పర్ టైర్ల కింద నలిగి వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి పై టైర్లు ఎక్కడంతో తొడల నుంచి రెండు కాళ్ళ భాగాలు పూర్తిగా ఎక్కడికక్కడ చెదిరిపోవడం జరిగింది .కేవలం టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.మృతుడు మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పేరు వివరాలు తెలియాల్సి ఉంది.