టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం

టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం

  • భక్తుల ఉచిత రవాణా కోసం వినియోగించనున్న టీటీడీ

తిరుమల, ఆంధ్రప్రభ : చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్థమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కు దాత అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటూ దాతను అభినందించారు. టీటీడీ ఈ ఎలక్ట్రిక్ బస్సును తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సేవల కోసం వినియోగించనుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు డీపీ అనంత, తిరుమల ట్రాన్స్‌పోర్ట్ డీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply