may16editorial | సర్వత్రా పొదుపు మంత్రం..

may16editorial | సర్వత్రా పొదుపు మంత్రం..

Prime Minister | పొదుపు పాటించాలని ప్రధాని పిలుపు
వర్క్ ఫ్రం హోం, వర్చువల్ విధానాల విస్తరణ
బంగారం వినియోగంపై నియంత్రణ
ఇంధన ధరల ప్రభావం మరియు ప్రజల మార్పు
ఆహారపు అలవాట్లలో మార్పులు
పొదుపు వల్ల ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు
మాటల్లోనూ పొదుపు అవసరం

may16editorial | ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు సందేశంలో అన్ని స్థాయిల్లో పొదుపు పాటించాలన్నారు.సర్వోన్నతన్యాయస్తానం కూడా ఈ పిలుపును అందుకుంది.వారంలో రెండు రోజులు సోమ,శుక్రవారాల్లో పూర్తిస్థాయిలో వర్చువల్‌ విధానంలో విచారణ జరపాలని నిర్ణయించింది.ఇప్పటికే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని ప్రభుత్వ సంస్థలే కాకండా, ప్రైవేటు సంస్థలు అమలు చేస్తున్నాయి.కార్పొరేట్‌ సంస్థలు, ఐటి సంస్థలు ప్రధాని ఈ పిలుపు ఇవ్వడానికి ముందే వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి.ఇంధనం వాడకంలో పొదుపును పాటించడం కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.అలాగే,విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఏడాది పాటు బంగారం వినియోగంలో నియంత్రణ పాటించాలని కూడా ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు.

ఇది కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు.తరతరాలుగా మన దేశంలో బంగారాన్ని ఆపద కాలంలో ఆదుకునే ఆస్తిగా పరిగణిస్తారు.అత్యవసర పనులకు బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటారు.తమిళనాడులో ఓ సంప్రదాయం ఉంది.పుట్టింటి వారి నుంచి తల్లి ఎంత బంగారం తెస్తుందో ఆడపిల్లకు కూడా అంత బంగారం పెట్టాలని.ఇప్పుడు పరిస్థితులు మారడం వల్ల ఆ సంప్రదాయాలు, ఆచారాలు ఎవరూ పాటించడం లేదు.హిందూ సంప్రదాయంలో పెళ్ళయిన గృహిణికి తాళిబొట్టు చిరునామాగా పరిగణిస్తారు. ఎంత లేని వాళ్ళయినా తాళిబొట్టును తీయడానికి ససేమిరా అంటారు.

మన దేశంలో ఆచార వ్యవహారాలను తుచ పాటిస్తున్న వారు సైతం ఇప్పుడు బంగారం కొనుగోలు విషయంలో వెనుకాడుతున్నారు.అలాగే, వాహనాల వినియోగం విషయంలో కూడా.పెట్రోల్‌,ఇతర ఇంధన ధరలు పెరిగి పోవడంతో సంపన్న వర్గాలు వాహనాలను తగ్గించుకుంటున్నారు.గతంలో వాహనాలను స్వేచ్ఛగా వాడుకున్నవారు సైతం ఇప్పుడు వాటిని ఐరావతాలుగా పరిగణిస్తున్నారు.పొదుపు మంత్రం ఉద్యోగులు, అధికారులకే కాకుండా, అన్నిస్థాయిల్లో అనివార్యంగా పాటిస్తున్నారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేద్ర ఫడ్నవీస్‌ ద్విచక్రవాహనంపై సచివాలయానికి వెళ్ళిన ఘటన పెద్దవార్త అయింది.దేశంలోని ప్రధాన రాష్ట్రాలు, కేంద్రాలు,ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారు బస్సుల్లో, ప్రజారవాణా సంస్థ సంకేతాలైన మెట్రో రైళ్ళల్లో ప్రయాణిస్తున్నారు.

ఇరాన్‌ యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాల్లో పెట్రోల్‌,డీజెల్‌ కొరత ఎక్కువగా ఉన్నప్పటికీ,మన దేశంలో ఇంతవరకూ కొరత ఏర్పడలేదు. శుక్రవారం నాడు ఈ రెండింటి ధరలను మూడేసి రూపాయిల వంతున పెంచారు.ఇంకా ఎంతైనా పెంచే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.ప్రధానమంత్రి యూఏఈ తదితర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలులోకి వస్తే పెట్రోల్‌,గ్యాస్‌,డీజిల్‌ వంటి పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరగకుండా ఉంటాయని జనం ఆశిస్తున్నారు.అలాగే, వంటనూనెలు,తదితర దిగుమతి ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు.

వంటనూనెల వినియోగం తగ్గించుకుంటే ఇంటిఖర్చు తగ్గడమే కాకుండా,ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.మన పూర్వీకులు వంటనూనెలను పొదుపుగా వాడేవారు.ఇప్పుడు తినుబండారాలకు జనం అలవాటు పడుతున్నారు.దాంతో చిన్న వయసులోనే జీర్ణశక్తి లోపంతో బాధపడుతున్నారు.ప్రజల ఆహారపు,ఆహార్య అలవాట్లలో మార్పులవల్ల ఇంటిఖర్చులు పెరిగి పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు అనివార్యం అవుతున్నాయి. వీటి నుంచి నివారణకు మనం తినే ఆహారంలో,మన ఆహార్యంలో, కట్టులో పొదుపు మంత్రాన్ని పాటించడం అత్యవసరం.

మన దేశంలో తరతరాలుగా అనుసరిస్తున్న అలవాట్లే మన ఆయుష్షును పెంచుతున్నాయి.అలాగే, పెద్దల నుంచి పిన్నల వరకూ అంతా తమ అలవాట్లను నియంత్రించుకోవడం వల్ల వారి ఆయుర్దాయం పెరుగుతోంది.పొదుపు అనేది కేవలం డబ్బుకి సంబంధించిన అంశమే కాదు. అన్ని విషయాల్లో పొదుపు పాటిస్తే మనకు తిరుగు ఉండదు.ముఖ్యంగా మాటల్లో పొదుపును పాటిస్తే, ఎదుటి వారితో గొడవలు రావు.పదిమందిలో సఖ్యతగా మన జీవనవిధానం సాగుతుంది.

CLICK HERE TO READ 40Cargo Planes | భారత పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం

CLICK HERE TO READ MORE

Leave a Reply