Family Disputes | భార్యపై కోపంతో… కూతురిని ….

Family Disputes | భార్యపై కోపంతో… కూతురిని ….

Family Disputes | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ పసిప్రాణాన్ని బలిగొన్నాయి. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో భార్యతో జరిగిన గొడవ అనంతరం కోపంతో ఓ వ్యక్తి తన చిన్నారి కూతురిని బావిలో తోసి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామవరపు రాజు తన భార్యతో గొడవపడిన అనంతరం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన కూతురు లహరిని సమీపంలోని బావిలో తోసేశాడు. నీటిలో మునిగి చిన్నారి మృతి చెందినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.