ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యబోధనలు సాధ్యమని ఊట్కూర్ సర్పంచ్ ఎం.రేణుక భరత్, మండల విద్యాశాఖ అధికారినిమాధవిఅన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, విద్య వారోత్సవాలను పురస్కరించుకొనిర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనలతోపాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు దుస్తులు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం కల్పిస్తుందనిఅన్నారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధనలు చేపడుతుండడంతో ప్రైవేటుకు దీటుగాఉత్తమఫలితాలు సాధిస్తున్నామని అన్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు విద్యార్థులకు చదువుతోపాటు క్రీడారంగంలో తీర్చిదిద్దుతున్నామనిఅన్నారు. బడి ఈడు కలిగిన బడి బయట పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉద్యోగ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఊట్కూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యా వారోత్సవాలు చేపడుతున్నామన్నారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం కుసుమ, హెచ్ఎంలు గురునాథ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
