ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ సందర్భంగా భగీరథ్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం వచ్చే వరకు తన క్లయింట్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ (ఇంటరిమ్ ప్రొటెక్షన్) కల్పించాలని అభ్యర్థించారు.

అయితే మధ్యంతర రక్షణకు సంబంధించిన అంశంపై కోర్టు పూర్తి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.