Kalajata programme | తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో..

Kalajata programme | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాండూర్ విశ్వేశ్వరరావు బ్రాంచ్ మేనేజర్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానికంగా ఆర్థిక అక్షరాస్యత, సామాజిక భద్రత పథకాలపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శివ కళాబృందం ప్రజలను ఆకట్టుకునే విధంగా నిర్వహించింది. ఈసందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారు సంవత్సరానికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే, ప్రమాదం, కరెంట్ షాక్, పాముకాటు లేదా సహజ మరణం సంభవించినప్పుడు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ప్రయోజనాలను కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో రీ-కేవైసీ ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కళాజాత బృందం పాటలు, మ్యాజిక్ షో ద్వారా ఈ అంశాలను సులభంగా ప్రజలకు చేరవేసింది. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ఎన్నం అశోక్ మాట్లాడుతూ… ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృంద సభ్యులు శివ, బ్యాంకు సిబ్బంది అకౌంటెంట్ రవి, వీవో కిరణ్, శబానా తదితరులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
