అరైవ్ అలైవ్ తో రైతులకు అవగాహన

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాసర సీఐ కిరణ్ కుమార్ సూచించారు. గురువారం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.