AI | 4వేల మంది తొలగింపునకు సిస్కో నిర్ణయం
AI | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో మరోవిడత ఉద్యోగ కోతలను ప్రకటించింది. టెక్ రంగంలో AI వైపు ఫోకస్ మారడం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం గత కొన్ని క్వార్టర్లుగా సిస్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు లేఆఫ్‌లు చేస్తున్నాయి. 2026లో కూడా టెక్ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. సిస్కో 2024, 2025లో కూడా ఉద్యోగ కోతలు చేసింది.
ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కంటే తక్కువేనని తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధికి అవకాశం ఉన్న రంగాల వైపు పెట్టుబడులను మళ్లించే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేపడుతున్నట్లు సంస్థ పేర్కొంది.
సంస్థ భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని, మరోవైపు కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాలను కూడా వెల్లడించింది. ఈ కాలంలో 12 శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసినట్లు సిస్కో తెలిపింది.
