Veedi Satheesh | కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
Veedi Satheesh | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : వీడి సతీషన్ ను కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని United Democratic Front (యూడీఎఫ్) కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వీడి సతీషన్ పేరును అధికారికంగా ప్రకటించింది. పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు మద్దతు లభించినట్లు సమాచారం.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో కేరళలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తూ కొత్త ప్రభుత్వం ముందుకు సాగనుందని పార్టీ నేతలు పేర్కొన్నారు.
