AP | దుండగుడికి దేహశుద్ధి..
AP | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మార్నేపల్లి గ్రామంలో ఓ బాలుడిని అపహరించేందుకు దుండగులు ప్రయత్నించగా గ్రామస్తుల అప్రమత్తతతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దుండగులు బాలుడిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అతడు గట్టిగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. గ్రామస్తులు కిడ్నాపర్లను వెంబడించి బాలుడిని రక్షించారు.
ఈ ఘటనలో ఇద్దరు దుండగులు పరారయ్యారు. మరో వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు సమాచారం. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
