ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం
ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం
వెల్దండ, ఆంధ్రప్రభ : ఆడ కూతురు పెళ్లి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు సింగిల్ విండో డైరెక్టర్ నాగుల నాయక్ తెలిపారు. వెల్దండ మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన దొబ్బల బాలయ్య కూతురు వివాహానికి బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపిటిసి, సింగిల్ విండో డైరెక్టర్ నాగుల నాయక్ తన వంతు సహాయంగా ఆడ కూతురు వివాహానికి 10వేల రూపాయలు ఆర్థిక సహాయని అందజేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాల లక్ష్మయ్య, రాగాయపల్లి ఉపసర్పంచ్ కొండల్ యాదవ్, గ్రామ పెద్దలు మాధవ రెడ్డి గారు, రామదాసు,దొబ్బల బాబురావు,దొబ్బలయాదగిరి,
దువాసి బాలరాజ్,తదితరులు పాల్గొన్నారు.
