ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ
చిట్యాల, ఆంధ్రప్రభ: లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల అధ్యక్షుడు, ఎం. జె. ఎఫ్ లయన్ రవీందర్ జనగం సౌజన్యంతో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థినీలకు సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు లయన్ మాధవరెడ్డి పాటి, ప్రధాన కార్యదర్శి లయన్ నరసింహ రేగుల గడ్డ, డైరెక్టర్లు లయన్ వెంకటేశ్వర్లు రంగా, లయన్ సతీష్ కంబంపాటి, లయన్ మహేందర్ రెడ్డి నల్ల, లయన్ ఎల్లయ్య కోనేటి, మరియు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
