బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం

బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం
తొర్రూరు, ఆంధ్రప్రభ: బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కమటం సాయికుమార్ ఇటీవల మృతి చెందడంతో మంగళవారం జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డిలు సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి బాధితుని కుటుంబానికి రూ. 3 వేల నగదు 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల సహకారంతో బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మనబోయిన వెంకన్న యాదవ్,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తంగళ్ళపల్లి అశోక్ ,మాజీ గ్రామపార్టీ అధ్యక్షులు వడ్లకొండ కుమార్,మాజీ సర్పంచ్ కాటం మల్లారెడ్డి, వడ్లకొండ ఉప్పలయ్య, కుంట రవి, ఎల్లాగౌడ్,అన్వేష్,రాంబాబు, సుధాకర్,వంశీ, కాటo వెంకటరెడ్డి,రాసాల వీరన్న,అజీమ్,కేదారి ,ఐలయ్య, కమటం యాకయ్య, ఎడ్ల నితీష్, ఎలేందర్,యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
