బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని భీంగల్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేంద్ర మంత్రి కొడుకును ఇంతవరకు అరెస్టు చేయలేదని వారు విమర్శించారు.

పోక్సో కేసు నమోదైన చర్యలు తీసుకోకపోవడం భావ్యం కాదన్నారు. ఈ సందర్బంగా సుమంగళి చౌరస్తా వద్ద రాస్తా రోఖో నిర్వహించి బండి సంజయ్, ఆయన కుమారుడు చిత్రాలను దహనం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, నాయకులు మొయిస్, మల్లెల ప్రసాద్, బోదిరే నర్సయ్య, నీలం రవి, మూత లింబాద్రి, సతీష్ గౌడ్, పర్శ నవీన్, రాములు, అజీజ్, నర్సింహా చారి, సూర్జిల్, శ్రీనివాస్, ఇక్రమ్, అవినాష్, ముత్తన్న, సురేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.