బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
•డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి
డోంగ్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బాధితురాలి తండ్రి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి మాట్లాడుతూ, “మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు నమోదైతే చట్టం ప్రకారం వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ బీజేపీ పెద్దల ఒత్తిడితో పోలీసులు మౌనంగా ఉండటం చట్టాన్ని, న్యాయాన్ని అవమానించడమే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“బేటీ బచావో, బేటీ పడావో” అని నినాదాలు చేసే బీజేపీ నిజంగా మహిళల రక్షణపై చిత్తశుద్ధితో ఉంటే, తమ పార్టీ నేత కుమారుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమని, నిందితుడు ఎంతటి వ్యక్తి అయినా వెంటనే అరెస్ట్ చేసి న్యాయ విచారణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, సర్పంచ్‌లు సంగ్రామ్ పటేల్, బస్వరాజ్ పటేల్, శ్రీధర్, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, నాయకులు చాంద్ పటేల్, ధనంజయ్ పాటిల్, విలాస్ గైక్వాడ్, శివారెడ్డి, సాయిగొండ, హనుమంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
