మెండోరా రామాలయంలో ప్రత్యేక పూజలు..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలోని శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలకు బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు అరె రవీందర్ మాట్లాడుతూ, రామరాజ్య పరిపాలన గురించి రామాయణంలో చదివామని, పెద్దల ద్వారా విన్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆ ఆదర్శాలను ప్రతిబింబించే విధమైన పాలనను చూస్తోందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ సీతారామచంద్రస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా మోదీ మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు నాగార్జున్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు ఎర్రోల్ల గంగాధర్, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు తక్కూరి అంజయ్య, శక్తి కేంద్ర ఇన్‌చార్జి గాడి వేణు, సీనియర్ నాయకులు పార్వతి శ్రీనివాస్, ఏశాల గంగాధర్, వాల్గోట్ బాబూరావు, సంగెపు గంగాధర్, లింబాద్రి గౌడ్, రాంచందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సిలివేరి రమణాచారి, మెంగ నర్సయ్య, ఏశాల హన్మాండ్లు, జాగీర్యాల శ్రీకాంత్, కల్లెడ రాజేశ్వర్, కంఠం గంగా ప్రశాంత్, రోడ్డోళ్ల ఆంజి, రాజేశ్వర్, గౌరు లింబాద్రి తదితరులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
