కారు లోయలో పడి.. ఆరుగురు మృతి

కారు లోయలో పడి.. ఆరుగురు మృతి

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. భారీ వర్షాల మధ్య పర్యాటకులతో వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులతో చంబా జిల్లా ప్రాంతాల్లో రహదారులు ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు సమాచారం.

ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.