వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

  • మండల విద్యాధికారి రామ్మోహన్ రావు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి రామ్మోహన్ రావు అన్నారు.సోమవారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పీఎం శ్రీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆయన ప్రారంభించారు.99 రోజుల ప్రజా పాలన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు..వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటి వద్ద డిజిటల్ మీడియాకు అలవాటు పడకుండా వారి సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.

వీటిలో డ్యాన్సు,ఆర్ట్స్,క్రాఫ్ట్స్,క్రీడలు తదితర అంశాలపై ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు.పాఠశాలలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు శారీరక వికాసం సాధించవచ్చునని తెలిపారు.ప్రతిరోజు స్నాక్స్ కూడా అందిస్తామన్నారు.ఈ శిబిరం ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు,వార్డు సభ్యుడు ఎల్లావుల ఉపేందర్,పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు ఉన్నారు.