Us China Talks : అమెరికా..చైనా కీలక భేటీ Andhra Ptabha Top Story

Us China Talks : అమెరికా..చైనా కీలక భేటీ Andhra Ptabha Top Story

  • ఇరాన్ అంశమే హాట్ టాపిక్
  • ట్రేడ్ వార్ నుంచి చర్చల దారిలో అగ్రరాజ్యాలు
  • బీజింగ్‌లో ట్రంప్-జిన్‌పింగ్ కీలక సమావేశం
  • వాణిజ్యం, తైవాన్, అణ్వాయుధాలపై చర్చలు
  • కీలక ఖనిజాల ఒప్పందంపై ఉత్కంఠ
  • ఇరాన్ యుద్ధంపై చైనాపై ట్రంప్ ఒత్తిడి
  • రష్యా, తైవాన్ వ్యవహారాలూ ఎజెండాలోనే
  • ఏఐ టెక్నాలజీపై అమెరికా ఆందోళనలు

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిది)

Us China Talks

ఆయుధ రహిత.. ట్రేడ్​ వార్​ లో… ఆంక్షల అస్త్రాలతో.. హోరాహోరీ పోరులో చతికిల పడిన ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక రాజ్యాల అధినేతలు.. మరో నాలుగైదు రోజుల్లో జరిగే ముఖాముఖీ చర్చలకు సర్వసన్నద్ధం అవుతున్నారు. చైనా రాజధాని బీజింగ్​ లో ఇటు హెవీ డ్రాగన్​… అటు ఫ్లై ఈగిల్​ భేటీ కానున్న తరుణంలో.. ప్రధానంగా ఏ అంశంపై చర్చ జరగబోతోందంటే…ఇంకేముందీ ఇరానీ చాయ్​ గురించే అని యావత్​ ప్రపంచ దేశాల జ్యోతిష్య పండితులు గట్టిగా వాదిస్తున్నారు. ఔను.. గత ఆరేళ్లుగా సాగిన ఈ రెండు దేశాల వాణిజ్య యుద్ధం తాజాగా క్లైమాక్స్​ సీన్​ కు చేరుకుంది. కాక పోతే ఇక్కడే మరో ట్విస్ట్​.. వెనిజులా సహా బలహీన దేశాలపై జైత్రయాత్రతో కమ్యూనిస్టు దేశాల సంగతి తేల్చాలని ఇజ్రాయెల్​ సహకారంతో తమ పై దండెత్తిన అమెరికాకు ఇరాన్​ చుక్కలు చూపిస్తోంది. టామ్​ అండ్​ జెర్రీ గేమ్​ తరహాలో.. ఇరాన్​ గులకరాళ్ల దెబ్బతో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ మైండ్​ బ్లాక్​ కావటంతోనే … అమెరికా, చైనా పరస్పర చర్చలకు ఏకాభిప్రాయానికి వచ్చిన మాట యధార్థం. ఇంతకీ ఈ భేటీలో చర్చనీయాంశాల ఎజెండా ఏమిటో ఒకసారి పరిశీలిద్ధాం.

Us China Talks : ఎజెండాలివే..

వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు, వాణిజ్యం, పెట్టుబడి వేదికలపై ఒప్పందాలకు ఈ రెండు దేశాలు మాట్లాడుకుంటాయి.. ఇది ఒక ఎజెండా. ఇక ఇరాన్, తైవాన్, అణ్వాయుధాలు, కృత్రిమ మేధపై ఉద్రిక్తతల పరిష్కారం మరో ఎజెండా. అరుదైన ఖనిజాల ఒప్పంద పొడిగింపు అనేది మూడవ ఎజెండా. కానీ.. ఈ మూడు అంశాల్లోనూ.. ఇరాన్​ యుద్ధానికి తెర అనేది ప్రధాన అంశం. ఇది ముమ్మాటికీ నిజం. ఈ వారం చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటనకు ముందు, కీలక ఖనిజాల ఒప్పందాన్ని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో…ఇరాన్, తైవాన్, కృత్రిమ మేధ, అణ్వాయుధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చర్చిస్తారని అమెరికా అధికారులు తెలిపారు.

Us China Talks : చైనా నేలపై తొలి అడుగు

Us China Talks

ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు, వాణిజ్యం, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర విభేదాలతో దెబ్బతిన్న బాంధవ్యాలను స్థిరీకరించే ప్రయత్నంలోనే.. ఈ అగ్రరాజ్యాల అగ్రనేతలు తమ తొలి ముఖాముఖి చర్చలు జరపనున్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న చర్చలకు ముందుగా, ట్రంప్ బుధవారం బీజింగ్‌కు చేరుకొంటారు. 2017 తర్వాత చైనాలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి.

Us China Talks : వాణిజ్య ఒప్పందాలివే..

Us China Talks

పరస్పర వాణిజ్యం . పెట్టుబడులను సులభతరం చేసే అంశాలపై అమెరికా, చైనా అంగీకరించే అవకాశం ఉందని, అదే సమయంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయం. ఇంధనం కొనుగోళ్లను చైనా స్వీకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో వాణిజ్య మండలి (బోర్డ్ ఆఫ్ ట్రేడ్) పెట్టుబడుల మండలి (బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్) ఏర్పాటు ప్రణాళికలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, అమలు చేయడానికి ముందు ఆయా యంత్రాంగాలపై తదుపరి కసరత్తు అవసరం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు, చైనా నుండి అమెరికాకు కీలక ఖనిజాలు సరఫరాకు అనుమతించే తమ వాణిజ్య యుద్ధంలో ఆంక్షల విరమణను పొడిగించడంపై కూడా ఇరు దేశాలు చర్చిస్తాయని, ఈ ఒప్పందాన్ని ఈ వారం పొడిగిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ, గత వింటర్​ లో కుదిరిన ఆంక్షల విరమణ , ఇప్పటికీ అమలులో ఉన్నప్పటికీ చివరికి పొడిగిస్తారని అధికారులు భావిస్తున్నారు.

Us China Talks : ఇరాన్​ అంశమే కీలకం. .

Us China Talks

మరింత క్లిష్ట సమస్యలలో తైవాన్, అణ్వాయుధాలు, ఇరాన్ ఏఐ ఉన్నాయి. అమెరికా-చైనా మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలకు మూలమైన ఇరాన్, తైవాన్ , అణ్వాయుధాల వంటి అంశాల వైపు కూడా ట్రంప్-జిన్​ పింగ్​ చర్చలు, మళ్లవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌తో చైనా సంబంధాలను కొనసాగిస్తోంది ఇరాన్​ చమురు ప్రధాన వినియోగదారుగా చైనా ఉంది. ఫిబ్రవరి చివరలో అమెరికా , ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పుడు మొదలైన ఘర్షణను ముగించి, వాషింగ్టన్‌తో ఒ ప్పందం కుదుర్చుకునేలా టెహ్రాన్‌ పై ఒత్తిడి తీసుకురావాలని చైనాపై ట్రంప్​ ఒత్తిడి తెస్తున్నారు.

Us China Talks : రష్యా సంగతిపైనా..

Us China Talks

రష్యాతో చైనా వ్యవహారాలపై కూడా ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ షీ జిన్‌పింగ్‌తో ఇరాన్, రష్యా అంశాలపై పలుమార్లు మాట్లాడారు. ఈ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆదాయం, ద్వంద్వ ప్రయోజన వస్తువులు, విడిభాగాలు, ఆయుధాల ఎగుమతుల సామర్థ్యం వంటి విషయాలు కూడా చర్చకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. తైవాన్ విషయంలో వాషింగ్టన్‌పై షీ అసంతృప్తితో ఉన్నారు. ప్రజాస్వామ్య పాలనలోని తైవాన్​ ద్వీపానికి అమెరికా అత్యంత ముఖ్య అంతర్జాతీయ మద్దతుదారుగా, ఆయుధ సరఫరాదారుగా ఉంది. తైవాన్​ తన భూభాగమనపి చైనా వాదిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్ సమీపంలో చైనా తన సైనిక ఉనికిని పెంచుకుంది, కానీ అమెరికా విధానంలో మార్పు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.

Us China Talks : ఏఐ పై చర్చ అంతంతే

Us China Talks

చైనాలో అభివృద్ధి చెందుతున్న అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలపై ట్రంప్ సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వినియోగంతో తలెత్తే సంఘర్షణలను నివారించడానికి ఇరుపక్షాలకు “ఒక చర్చావేదిక అవసరం అని అధికారులు అంటున్నారు. తన అణ్వాయుధాల గురించి చర్చించడానికి విముఖత చూపుతున్నప్పటికీ, వాషింగ్టన్ కూడా బీజింగ్‌తో అణ్వాయుధాల గురించి చర్చలు ప్రారంభించాలని చాలా కాలంగా ఆశిస్తోంది. “ప్రస్తుతానికి ఎలాంటి అణ్వాయుధ నియంత్రణ లేదా అలాంటి విషయాలపై కూర్చుని చర్చించడానికి తమకు ఆసక్తి లేదని” చైనా ప్రభుత్వం అమెరికాకు రహస్యంగా చెప్పిందని ఆ అధికారి తెలిపారు. దక్షిణ కొరియాలో గత అక్టోబర్​ లో ట్రంప్​, జిన్​ పింగ్​ మధ్య చర్చ జరిగింది. అక్కడ, అమెరికా చైనా వస్తువులపై మూడు అంకెల సుంకాలను విధించగా, తన కీలక ఖనిజాల సరఫరాను పరిమితం చేస్తామని చైనా హెచ్చరించింది. దీంతో దక్షిణ కొరియాలో జరిగిన భేటీలో వాణిజ్య యుద్ధానికి విరామం ప్రకటించారు.

ALSO READ : Trump Angry ఈ షరతులు ఆమోదం కాదు Andhra Prabha Top Story