Interrogation | రూ.1.20 కోట్లు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

Interrogation | రూ.1.20 కోట్లు స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

Interrogation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా పెనుకొండ పరిధిలో సంచలనం సృష్టించిన హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.

పక్కా సమాచారంతో హవాలా డబ్బును తరలిస్తున్న కారును పోలీసులు వెంబడించి, మార్గమధ్యంలో అడ్డగించి దోపిడి ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, ఘటనలో ఉపయోగించిన మూడు కార్లను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల విచారణలో ఈ దోపిడీ ముందుగానే పథకం ప్రకారం జరిగినట్లు వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply