వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం…
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తెచ్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ సిహెచ్ రమేష్ బాబు పేర్కొన్నారు. మండల కేంద్రంలో కృష్ణాజిల్లా సహకార బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన బ్యాంక్ మేనేజర్లు దుర్గ ప్రసాద్ రంగు చెట్టి రజనీకాంత్ తో కలిసి ప్రారంభించారు. మాట్లాడుతూ వేసవికాలంలో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ముల్లపాడు సొసైటీ అధ్యక్షులు ఉమ్మినేని పుల్లారావు సొసైటీ కార్యదర్శులు శర్మ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
