ఉపాధిహామీ కూలికి చికిత్స చేసిన ఉద్యోగులు..

ఉపాధిహామీ కూలికి చికిత్స చేసిన ఉద్యోగులు..

జన్నారం, ఆంధ్రప్రభ : విషయం తెలిసిన తక్షణమే 108 ఉద్యోగులు స్పందించి ఉపాధి హామీ కూలికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రిలో చేర్పించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కామనపల్లికి చెందిన 55 ఏండ్ల మునిగెల లలిత మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులకు పోగా, అక్కడే అకస్మాత్తుగా పడిపోయింది.

ఈ విషయాన్ని జన్నారం లోని 108 అంబులెన్స్ ఉద్యోగులకు తెలుపగానే తక్షణమే అంబులెన్స్ ఈఎంటీ జాడి రమేష్,పైలెట్ శ్రీనివాస్ హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆమెకు ప్రథమ చికిత్స అందించి లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆమెను కుటుంబ సభ్యులు అక్కడి నుంచి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయిందని, ప్రాణాపాయం ఏమిలేదని చికిత్స పొందుతుందని సమాచారం.ఆ అంబులెన్స్ 108 ఉద్యోగులను పలువురు అభినందించారు.