కొడవటంచ నరసింహ స్వామిని దర్శించుకున్న పీసీసీ చీఫ్
కొడవటంచ నరసింహ స్వామిని దర్శించుకున్న పీసీసీ చీఫ్
రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండలంలోని కొడవటoచ శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని టీపీసీసీ అధ్యుక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శిoచుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయo మరో యాదగిరి గుట్టగా అభివృద్ధి చెందిదని ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెందాయని అన్నారు. వీరి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం చేసి తదుపరి స్వామి వారి శేష వస్త్రo లడ్డు ప్రసాదం వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య,గ్రామ ఉపసర్పంచ్ రాజేష్,గ్రామస్తులు కోటి శ్రీనివాస్ గౌడ్,ఓదెలు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
