విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
మక్తల్ , ఆంధ్రప్రభ: లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు సత్య ఆంజనేయులు వెల్లడించారు. ప్రోగ్రాం చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు సహకారంతో దాదాపు 80 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి సుమారు 50 మందిని కంటి శాస్త్ర చికిత్సల కోసం రామిరెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ అంజన్ కుమార్, సీనియర్ సభ్యులు కొండయ్య, బి.రాజశేఖర్ రెడ్డి, కర్ని స్వామి, రమేశ్ రావు,మున్సిపల్ కౌన్సిలర్ పీకే. నర్సింహ, నాయకులు బాల్చెడ్ మల్లికార్జున్, రఘు, అంజి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
